ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో మొక్కలు నాటుతున్న సామరస్య లైన్స్ అండ్ లియో క్లబ్స్ *
ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సామరస్య లైన్స్ అండ్ లియో క్లబ్ మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో లైన్స్ అండ్ లియో క్లబ్ వారి సహాయ సహకారాలతో మొక్కలు నాటారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి తెలిపారు.
విజయవాడ లైన్స్ అండ్ లియో క్లబ్ వారు క్యాంపస్ లియో క్లబ్ అనే పేరుతో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ వారితో కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. సామాజిక బాధ్యత లో భాగంగా కళాశాలలోని ఆర్థికంగా వెనుకబడిన EWS కు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు 5550/- ఎగ్జామ్ ఫీజు విరాళం చేశారని లియో డిస్టిక్ చైర్ పర్సన్ లయన్ కె లక్ష్మీ పద్మజ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ సర్వాణి, క్లబ్ ప్రెసిడెంట్ లయన్ దివ్యవాణి, లయన్ సరళ,లలిత, జ్యోతి, వేణి, తార, లియో క్యాంపస్ ప్రెసిడెంట్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్, సాయి నిరుప్, సెక్రటరీ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ భాగ్యశ్రీలత ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY