చిలుకూరు ప్రాథమిక సహకార సంఘం ఎదుట రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన.
సాక్షిత చిలుకూరు : యూరియా మ్యాప్ ను రద్దు చేయాలని నిరసన. చిలుకూరు లో యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చిలుకూరు ప్రాధమిక సహాకార సంఘంకు రైతులు తాళం వేశారు. ఈ ఘటన చిలుకూరు పీఏసీఎస్లో జరిగింది. స్టాక్ అప్లోడ్ చేసిన ఒక్క నిమిషంకే యూరియా కట్టలు అయిపోతున్నాయని మండిపడ్డారు.
యూరియాను యాప్ ద్వారా ఇవ్వడం వల్లన ఇక్కడ ప్రాంత రైతులు కాకుండా ఎక్కడో ఉన్న రైతులు వచ్చి యూరియాను తీసుకుంటున్నారని తమకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సక్రమంగా సమయంకు అందకపోవడం వల్లన పోలాలు ఎర్రబారుతున్నాయని మండిపడ్డారు. చాలా మంది రైతులకు యాప్లు లేక ఇబ్బందులు పడుతున్నారని యాప్ను తొలగించి యూరియా గతంలో మాధిరిగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడే కూర్చోనున్నారు. పురుగు మందు డబ్బాతో ఒక రైతు ఘటన స్థలంకు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలంకు వచ్చి అన్నదాతలకు నచ్చ చెప్పి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY