పేదలకు ఇండ్లు కట్టి ఇస్తే.. వారి గుండెల్లో మన గూడు కట్టుకుంటారు..అదే ఆశించి ప్రజా ప్రభుత్వం పాలనను అందిస్తుంది.
కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపధ్యంలో పాల్వంచ, కొత్తగూడెం లోని అన్ని డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవీ ప్రసన్న , మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, సిపిఐ నాయకులు, ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది.
గత 25 సంవత్సరాలుగా పాల్వంచ మున్సిపల్ ఎన్నికలకు దూరం అయింది. మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారంతో నేను తీసుకున్న ప్రత్యేక చొరవతో ఈ పాల్వంచను కలుపుకుని కొత్తగూడెంలో మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. పాల్వంచలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మన ప్రభుత్వంలో వచ్చిన తొలి మున్సిపల్ ఎన్నికలు ఇవి..మన దగ్గరే అధికారం ఉంది అభివృద్ధి కూడ మనమే చేసుకోగలం.
పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో444, 727, 817, 999 భూములు సర్వే నెంబర్లలో ఏండ్ల తరబడి నివాసం ఉన్నా కూడ దానిమీద హక్కులు లేకపోవడం వల్ల అభద్రతకు లోనవుతున్నారు. తరతరాలుగా పీడిస్తున్న మీ సమస్యను పూర్తి హక్కులతో పరిష్కరించే బాధ్యత నాదే. అంతే కాదు కల్వర్టులు,రోడ్లు,డ్రైన్లు, ఈద్గా, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు, ఇండ్లపై హై టెన్షన్ విద్యుత్ తీగల తొలగింపు, తాగునీటి సమస్య పరిష్కారం చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను తీసుకుంటాను.
కత్తి ఒకరికి ఇచ్చి..యుద్ధం ఒకరిని చేయమనలేం..కత్తి నాకు ఇవ్వండి మీ సమస్యల పరిష్కారం చేసే యుద్ధం కూడా నేనే చేస్తా. కులం,మతం,పార్టీ ఏదని చూడం, ఓటేస్తేనే ఇళ్లిస్తాం అని చెప్పం, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, పేదలకు ఇండ్లు కట్టిస్తే, వారిగుండెల్లో పెట్టుకుంటారు. అదే ఆశించి ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షం సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీపైన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అని పట్ణణ ప్రజలను కోరడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY