మానవత్వం చాటుకున్న పల్నాడు కలెక్టర్ కృతిక శుక్ల
వికలాంగుల వద్దకే వెళ్లి అర్జీల స్వీకరణ
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తన ఉదారతనుచాటుకున్నారు.సాధారణంగా ప్రజలు తమ సమస్యల విన్నపం కోసం అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ, అందుకు భిన్నంగా కలెక్టర్ స్వయంగా వికలాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చారు పలువురు దివ్యాంగులు, వృద్ధులు ప్రాంగణంలోనే వేచి ఉండటాన్ని కలెక్టర్ గమనించారు.ప్రోటోకాల్ పక్కన పెట్టి, స్వయంగా కిందకు దిగి వచ్చిన కలెక్టర్.. అక్కడ ఉన్న వికలాంగుల వద్దకు వెళ్లి కూర్చుని వారి అర్జీలను స్వీకరించారు.వారి సమస్యలను ఓపిగ్గా విన్న ఆమె, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY