శేరిలింగంపల్లి డివిజన్ లోగల కొండాపూర్ ZPHS గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి ఉద్యోగ విరమణను పురస్కరించుకుని అభినందన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సరస్వతి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ .
ఈ సందర్భంగా ఉమాదేవి ని సన్మానించిన కార్పొరేటర్ విద్యా రంగంలో చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు.
అనేక మంది విద్యార్థుల భవితకు బాటలు వేసిన ఉపాధ్యాయురాలుగా గుర్తుండిపోతారని తెలిపారు.
ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ హితానికి తన అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఉమాదేవి భవిష్యత్ జీవితం ఆరోగ్యంతో, ఆనందంతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, వార్డు మెంబర్ రాము, పి.ఆర్.టి.యు టిఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొనగారి కృష్ణారెడ్డి, మండల శాఖ అధ్యక్షులు హనుమంతు, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్ర రెడ్డి, మండల విద్యాధికారి వెంకటయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
