అమృతాలయ ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, స్వామివారి కృప కటాక్షాలు, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, దుర్గారావు, వెంకటేష్ యాదవ్, నరసింహారెడ్డి,లింగం యాదవ్ మరియుఆలయ కమిటీ సభ్యులు, డివిజన్ నాయకులు, మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
