కోదాడలో బ్యాంకు ఉద్యోగుల బైక్ ర్యాలీ…
సాక్షిత ప్రతినిధి కోదాడ : ఐదు రోజుల పని దినాలు అమలు చేయాల్సిందే బ్యాంకు ఉద్యోగుల డిమాండ్.
ఐదు రోజుల పని దినాల అమలుకై కోదాడలో బ్యాంకు ఉద్యోగుల బైక్ ర్యాలీ.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని దినాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ కోదాడలో అన్ని బ్యాంకుల యూనియన్లు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. సాయంత్రం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రధాన శాఖ ఎదుట వివిధ బ్యాంకుల ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐదు రోజుల పని దినాల డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉందని, కేంద్ర ప్రభుత్వం దీనిపై మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బ్యాంకుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, కొత్త నియామకాలు చేపట్టాలని వారు కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ నిరసన కార్యక్రమంలో మేనేజర్ శివకుమార్, చీఫ్ మేనేజర్ వీరస్వామి, వెంకటరత్నం, ఉమా మహేష్, చిట్టిబాబు, రాము, నందన్ రెడ్డి, సౌజన్య, రమ్య, సాయి వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY