ఉజ్జయిని మహంకాళి నగర్ కాలనీ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి నగర్ కాలనీ లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి నగర్ కాలనీలో కొంతమేర డ్రైనేజీ మరియు సీసీ రోడ్లకు సంబందించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, వాటిని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కాలనీలో కొన్ని చోట్ల విద్యుత్ స్తంబాలు రోడ్డు మీద ఉండి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని కాలనీ వాసులు కార్పొరేటర్ కి తెలియచేయగా, విద్యుత్ స్తంభాలను వెంటనే స్థానభ్రంశం చేసి రోడ్డు ప్రక్కన అమర్చాలని కార్పొరేటర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. డివిజన్ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, కాలనీలో పెండింగ్లో ఉండి అసంపూర్తిగా మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, గోపాల్, CH.అశోక్, పాండు, వై.శ్రీనివాస్, రాము, RV.రమణ, సారాయి కృష్ణ, షౌకత్ అలీ మున్నా, లింగం, సుధాకర్, సత్తయ్య, రమేష్.
జి.ఎచ్.ఎమ్.సి అధికారులు ఎస్.ఆర్.పి నాగేశ్వర నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, UBD నాగరాణి, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ శివ, ఎస్.ఎఫ్.ఎ వెంకటరెడ్డి & మల్లేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY