అలీన విధానం అమలులో మోడీ విఫలం…… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ దర్శి బాల నరసింహ
….
సాక్షిత వనపర్తి :
అమెరికా ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధ విరమణకు చొరవ చూపటల్లో దేశ ప్రధాని మోదీ విఫలమయ్యారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల నరసింహ విమర్శించారు. రాబర్ట్ అధ్యక్షతన జరిగిన వనపర్తి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గత ప్రభుత్వాలు దేశాల మధ్య యుద్ధాలు వచ్చినప్పుడు భారతదేశ అలీన విధానం పాటించి యుద్ద నివారణకు చొరవ చూపారని మోదీ విషయంలో అది లోపించిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు అప్పుడు అని మోడీ గొప్పలు చెప్పడం తప్ప యుద్ధంతో ఇండియాకు జరిగే నష్టాన్ని వివరించి రాజీతో యుద్ధ విరమణ చేయించలేకపోయారన్నారు.
ఇరాన్, క్యూబా, వెనుజుల దేశాలను ఆక్రమించాలనే ట్రంప్ సామ్రాజ్యవాద రాజ్య విస్తరణ కాంక్ష ప్రజా వినాశనం కలిగించే యుద్ధాలకు కారణమన్నారు. ఇరాన్ దేశంలో 30% చమురు నిల్వలు ఉన్నాయని వాటిని కొండగొట్టేందుకు ఇరాన్ వద్ద యురేనియం అనుబాంబులు ఉన్నాయని వాటితో తమకు ప్రమాదమని ప్రపంచాన్ని తప్పుదారి పట్టించి యుద్ధానికి దిగారు అన్నారు. ఫలితంగా భారతదేశంలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ కొరత కు దారి తీసింది అన్నారు. మోడీ మౌనం దేశానికి తీరని నష్టమన్నారు.
ఇరాన్ , ఇరాన్ మద్దతు దేశాల వద్ద ఆయుధ సంపత్తి ఉందని ఎంతకాలం యుద్ధం జరుగుతుందో చెప్పలేమని దేశంలో ఎన్ని సమస్యలు వస్తాయో అంతు పట్టడం లేదన్నారు. యుద్ధం తక్షణ ఆపేందుకు భారతదేశం తన వంతు పాత్రను పోషించాలన్నారు.
దేశంలో పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ కొరత ఫలితంగా ఇతర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు జీవించలేని పరిస్థితి ఏర్పడబోతోందని సమస్యల పరిష్కారానికి తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేస్తుందన్నారు. చాలామంది అర్హులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదని, రైతు భరోసా నిధులు పూర్తిస్థాయిలో రైతు ఖాతాల్లో జమ కాలేదని, రైతు బీమా పథకానికి నిధులు కేటాయించలేదని మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వలేదన్నారు.
ఆసరా పింఛన్లు రూ. 2000 నుంచి 4 వేలకు పెంచలేదని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదన్నారు. హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లోను కాంగ్రెస్ మిత్ర ధర్మం పాటించలేదని విమర్శించారు.
రానున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో సొంతంగా పోటీకి సిద్ధం కావాలని కోరారు. ఏప్రిల్ ఒకటి నుంచి పది వరకు ఇంటింటికి సిపిఐ ప్రోగ్రాం ఉందని ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం నేతలు కార్యకర్తలు పని చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, చంద్రయ్య, రాబర్ట్, రమేష్, మోష,భాస్కర్,రవీందర్, కురుమయ్య,అబ్రహం, కుతుబ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY