లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో *కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ * కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన చాపల లక్ష్మి, గుడ్డి భారతమ్మ, డి దేవి, రఫియా బేగం, బిరిదర్ సునీత, ఆవుల తిరుమలేష గతంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిఎం సహాయానిధి కింద దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈరోజు తన నివాసం వద్ద నాలుగు లక్షల రూపాయల సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణి చేశారు..
ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అలాగే మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో ప్రజాపాలన ద్వారా బడుగు,బలహీన వర్గాలకు అండగా నిలుస్తుంన్నారని కొనియాడారు..
ప్రజాపాలనలో పేద,మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా కార్పొరేట్ రంగంలో వైద్యం అందించడంతో పాటు వైద్యనికి అయినా ఖర్చులు సిఎంఆర్ఆఫ్ ద్వారా పేదలకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బొబ్బా రంగారావు, చాంద్ పాషా, కృష్ణ యాదవ్, నర్సింగరావు, గుబ్బల రమణ, గుమస్తా మధుసూదన్, జహంగీర్, బలరాం, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సంతోష్ గుప్తా, చోటు, బురాన్, నాగలక్ష్మి, శోభ, ధరణి మరియు లబ్దిదారులు, నియోజకవర్గం ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
