కొమ్మినేనికి టైమ్స్ ఆఫ్ ఇండియా పురస్కారం.. ప్రజలకే గర్వకారణం : ప్రత్తిపాటి
- ప్రముఖ వైద్యులు కొమ్మినేని శంకర్ రావును ఘనంగా సన్మానించిన మాజీమంత్రి.
- కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ శంకర్ రావుని కలిసి అభినందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, కూటమి నాయకులు
కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవస్థాపకులు, మాకు అత్యంత ఆప్తులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మినేని శంకర్ రావు కి టైమ్స్ ఆఫ్ ఇండియా పురస్కారం లభించడం నియోజకవర్గ, జిల్లా ప్రజలకు ఎంతో గర్వకారణమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
శనివారం స్థానిక కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు కొమ్మినేని శంకర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రత్తిపాటి, ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు.
ప్రజలు గర్వించే స్థాయిలో కొమ్మినేని మరిన్ని అవార్డులు, పురస్కారాలు పొందాలి
వైద్యసేవల్లో కొమ్మినేని శంకర్ రావు అందించిన సేవలకు గుర్తుగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పురస్కారం అందజేయడంపై ఎంతో సంతోషంగా ఉందని, ఆ పురస్కారం రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY