ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు… వెలుగొండలో వేగవంతమైన పనుల సమీక్ష!
ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగాలు, ఫీడర్ కెనాల్ పనుల పరిశీలనకు విచ్చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మరింత వేగవంతం చేశారు.
ఈ క్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు , ఆర్డీఓ శ్రీనివాస రెడ్డి తో కలిసి హెలిప్యాడ్ మరియు సభా స్థలం పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
ప్రతి ఏర్పాటును సమగ్రంగా పరిశీలిస్తూ, ఎటువంటి లోపాలు లేకుండా ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావాలనే దృఢ సంకల్పంతో అధికారులు మరియు పార్టీ నాయకులతో సమన్వయం చేస్తున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY