మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశం, అనంతరం బాకీ కార్డుల పంపిణీ
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని NSR ఫంక్షన్ హాల్, జిన్నారంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,
ఉధ్యమకారుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యం లో బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి , జిన్నారం మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ సాయి కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని విజయం వైపు నడిపించేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు ఐక్యంగా పనిచేయాలని, పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పోరాడాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇవ్వవలసిన హామీల బాకీ కార్డులను ప్రతి వార్డు వరకు తీసుకెళ్లి అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఈ కార్యక్రమం లో బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు సి.జీ.ఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి , మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి , బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేష్ , స్థానిక ఇన్‌చార్జులు శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ యాదవ్, జగన్నాథ్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY