నిజాంపేట్‌లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

|| నిజాంపేట్‌లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్‌లో అయ్యప్ప ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.