మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ ని కలిసిన కుల సంఘాల ప్రతినిధులు!!

Sakshitha news

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ ని కలిసిన కుల సంఘాల ప్రతినిధులు!!

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని వారి నివాసంలో పలువురు కుల సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యల పరిష్కారానికి వినతిపత్రాలు అందజేశారు.

అదేవిధంగా పలు వివాహ శుభకార్యాలు, కార్తీక వనభోజనాలకు ఆహ్వానించారు. జగద్గిరిగుట్టలో జరగనున్న 17వ సదర్ సమ్మేళన మహోత్సవం, కుత్బుల్లాపూర్ శెట్టిబలిజ కార్తీక వనభోజన మహోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు అందజేశారు