పదవి కేవలం హోదా మాత్రమేకాదు ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత… నూతన చైర్మన్ ప్రవీణ్ కుమార్ తో వై.వి.బి. రాజేంద్రప్రసాద్..

Sakshitha news

పదవి కేవలం హోదా మాత్రమేకాదు ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత… నూతన చైర్మన్ ప్రవీణ్ కుమార్ తో వై.వి.బి. రాజేంద్రప్రసాద్..

మీ నమ్మకాన్ని వమ్ము చేయను – ప్రవీణ్ కుమార్

ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా ఘన విజయం సాధించిన చెదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వై.వీ.బీ.రాజేంద్ర ప్రసాద్ దంపతులను వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ దంపతులను శాలువాతో సత్కరించి తన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకుని వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు..

ఈ సందర్భంగా చైర్మన్ చెదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..“మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ.రాజేంద్ర ప్రసాద్ గారు నా రాజకీయ గురువు. రాజకీయాల్లో నేను వేసిన తొలి అడుగుల నుంచి రాజకీయ ఓనమాలు అన్నీ ఆయన వద్దే నేర్చుకున్నాను. రాజకీయంగా నాకు మార్గదర్శనం చేస్తూ, ప్రతి సందర్భంలోనూ ప్రోత్సహించిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈరోజు ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా ప్రజల ఆశీర్వాదంతో ఎన్నిక కావడంలో ఆయన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఎంతో కీలకం.ఆయన ఆశయాలకు అనుగుణంగా, ప్రజలకు సేవ చేస్తూ ఉయ్యూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాను” అని ప్రవీణ్ కుమార్ అన్నారు.

రాజకీయ గురువును కలిసి కృతజ్ఞతలు తెలుపుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన చెదుర్తిపాటి ప్రవీణ్ కుమార్‌ దంపతులకు శాలువా కప్పి హృదయపూర్వక అభినందనలు రాజేంద్రప్రసాద్ దంపతులు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉయ్యూరు పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని రాజేంద్రప్రసాద్ సూచించారు.

చైర్మన్ పదవి కేవలం హోదా మాత్రమే కాదని, ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి వార్డులోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కౌన్సిలర్ల సమన్వయంతో ఉయ్యూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని రాజేంద్రప్రసాద్ ప్రవీణ్ కు దిశ నిర్దేశం చేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యలమంచిలి భ్రమరాంబ , ప్రవీణ్ సతీమణి చేదుర్తిపాటి శ్యామల గారు తదితరులు పాల్గొన్నారు.