ఓటు బచావో – దేశ్ బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు
కూకట్పల్లి, :
ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తిరిగి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, సీనియర్ నాయకులను అభినందిస్తూ గురువారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హేమదుర్గ భవన్లో సంబరాలు నిర్వహించారు.
టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి విజయోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ఢిల్లీలో నిర్వహించిన ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో బస్సుల ద్వారా తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
