చిలుకూరు సాయి గ్రామర్ స్కూల్‌లో ఘనంగా దామోదర దీపోత్సవం

Sakshitha news

చిలుకూరు సాయి గ్రామర్ స్కూల్‌లో ఘనంగా దామోదర దీపోత్సవం

సూర్యాపేట జిల్లా / చిలుకూరు, సాక్షిత :

పవిత్ర దామోదర మాసాన్ని పురస్కరించుకొని చిలుకూరు పట్టణంలోని సాయి గ్రామర్ స్కూల్‌లో దామోదర దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ సంస్థ సభ్యురాలు బోనగిరి హైమ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దామోదరుడి (శ్రీకృష్ణుడు) చిత్రపటం ఎదుట విద్యార్థులు నేతి దీపాలను వెలిగించి, దామోదర అష్టకాన్ని పఠిస్తూ భక్తితో హారతులు సమర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ గవిని ఆంజనేయులు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పట్ల విద్యార్థులకు చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దామోదర మాసంలో దీపదానం చేయడం వల్ల అజ్ఞానం తొలగి, సద్బుద్ధి, జ్ఞానం లభిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినులు దీప్తి, ఉమా, అనూష, అరుణ, ఇందిర, ఇందుతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.