ఆటో డ్రైవర్ల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

Sakshitha news

ఆటో డ్రైవర్ల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…

ఐనవోలు మండలంలోని పున్నెలు స్టేజి వద్ద ఆదర్శ ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ బోర్డును హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు నిత్యం ప్రజలకు రవాణా సేవలు అందిస్తూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎండ, వాన అనే తేడా లేకుండా కష్టపడి కుటుంబాలను పోషించుకుంటూ, ప్రజల ప్రయాణ అవసరాలను తీరుస్తున్న ఆటో డ్రైవర్ల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్లు ఐక్యంగా ఉంటూ తమ హక్కులు, సంక్షేమం కోసం సంఘటితంగా ముందుకు సాగాలని సూచించారు. అసోసియేషన్ ద్వారా డ్రైవర్ల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా సేవలందించాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసోసియేషన్ ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.