ఘనంగా ఆహార ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం

Sakshitha news

ఘనంగా ఆహార ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం

ప్రారంభించిన ఎమ్మెల్యే KR నాగరాజు …

ఐనవోలు మండలం పున్నెలు క్రాస్ వద్ద ఐనవోలు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్‌ నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు , హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి , హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ హాజరై రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. నూతనంగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న యువతకు ప్రోత్సాహం అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆహార ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వాహకులు ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ, వినియోగదారుల ఆదరాభిమానాలతో వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకుడు, ఐనవోలు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్‌కు ఎమ్మెల్యే , ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ మాజీ చైర్మన్‌ మార్నేని రవీందర్ రావు, ఐనవోలు మండల అధ్యక్షులు నకరకంటి మోహన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు,చైర్మన్లు,మండల అధ్యక్షులు,సర్పంచులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.