చిల్కానగర్లో నూతన సీసీ రోడ్డు నిధులు కొరకు విన్నపం …
ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారితో కలిసి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ చిలికానగర్ కుమ్మరి కుంటలో నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
అదేవిధంగా రోడ్డుకు మరోవైపు రెండు కాలనీల మధ్యలో ఉన్న రోడ్డు కనెక్టివిటీ కి అడ్డంగా నిర్మాణం చేస్తున్న ప్లాట్ ఓనర్ పై చర్యలు తీసుకోవాలని, గతంలో రోడ్డుకు స్థలం వదిలిపెట్టిన వ్యక్తి ఇప్పుడు కాంపౌండ్ వాల్ కట్టి రెండు కాలనీల మధ్యలో ఉన్న కనెక్టివిటీ కి అడ్డంగా నిర్మాణం చేస్తున్నాడని జోనల్ కమిషనర్ గారికి విన్నవించు కోవడం జరిగింది.
సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అధికారులను పంపించి తగు చర్యలు చేపడతానని హామీ ఇవ్వడం జరిగింది.
కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, మాస శేఖర్,శ్యామ్,బంటి గౌడ్ మొదలగువారు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
