ఎస్‌కేఎస్ ఫోర్క్‌లిఫ్ట్ సర్వీసెస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
పారిశ్రామిక రంగ అభివృద్ధికి, వ్యాపార విస్తరణకు నూతన సంస్థలు దోహదపడాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లి పారిశ్రామికవాడలో ఎస్‌కేఎస్ ఫోర్క్‌లిఫ్ట్ సర్వీసెస్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో వస్తున్న నూతన అవకాశాలను యువ పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని, నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేయాలని ఆకాంక్షించారు. పారిశ్రామికవాడల్లో వ్యాపార సంస్థల అభివృద్ధి స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.
ఎస్‌కేఎస్ ఫోర్క్‌లిఫ్ట్ సర్వీసెస్ సంస్థ క్లూగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అధీకృత డీలర్‌గా మెటీరియల్ హ్యాండ్లింగ్ రంగంలో సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. సంస్థ యాజమాన్యం నాణ్యమైన సేవలతో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, BRS పార్టీ నాయకులు వినియోగదారులు, వ్యాపార భాగస్వాములు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
