భూమ్స్ అకాడమీని ప్రారంభించిన ……మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

Sakshitha news

భూమ్స్ అకాడమీని ప్రారంభించిన ……మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి . సాక్షి వెంకట్ పాల్గొనడం జరిగినది
గాజులరామారం డివిజన్ ఉషోదయ కాలనీలో భూమ్స్ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా పున్నారెడ్డి మాట్లాడుతూ…

“క్రీడలతోనే సంపూర్ణ వికాసం సాధ్యమవుతుంది. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి” అని తెలియజేశారు.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు ఎంతో అవసరమని ఆకాంక్షించారు.