ఢిల్లీలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ‘దేశ్ బచావో – ఓట్ బచావో’ భారీ నిరసన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు ఇండియా కూటమి పార్టీల నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేశంలో ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓటు చోరీ ఆరోపణలు, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ వంటి అంశాలను నాయకులు ప్రస్తావించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని, ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు కాపాడటమే లక్ష్యంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
