మునిసిపల్ కాంట్రాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం

Sakshitha news

మునిసిపల్ కాంట్రాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం


సూరారం మెయిన్ రోడ్డు మీద ఎటువంటి సేఫ్టీ లేకుండా పనులు,మునిసిపల్ కాంట్రాక్టర్ల రోడ్డు తవ్వి వారమైన ఎటువంటి సేఫ్టీ చర్యలు చేపట్టలేదు, తవ్విన మట్టిని ఇళ్ళకి అడ్డంగా పెట్టి ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెడతాము అని బెదిరింపులు ఆదివారం రోజు పనులు, ఏంటి అని అడిగితే ఆఫీస్ లో మాట్లాడుకో అని నిర్లక్షయపు సమాదానాలు, కాంట్రాక్టర్ అయితే ప్రజల ప్రాణాలు పట్టవా, ఇంటికి అడ్డంగా తవ్విన మట్టి పోసి ఎవరు లోపలికి బయటకి వెళ్లకుండా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇంట్లో ఉన్న వారికి హాస్పిటల్ కి కూడా వెళ్లలేని పరిస్థితి, ఇటువంటి కాంట్రాక్టర్ ని వెంటనే వర్క్ ఆర్డర్ కాన్సల్ చేసి బ్లాక్ లిస్ట్ చేయాలనీ స్థానిక ప్రజలు మరియు నాయకులు కోరుతున్నారు, ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన మంచి నీటి పైప్ లైన్ కూడా దెబ్బతింది ఇట్టి విషయమై స్థానిక నాయకులు వారాల వినోద్ కుమార్ సదరు కాంట్రాక్టర్ ని ప్రశ్నించగా ఏ డామేజ్ అయిన మాకు సంబంధం లేదు అది మీరే చేయించుకోవాలి అని దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని నిర్లక్షపు సమాధానం చెప్పాడు తరువాత కొంత సేపటికి మేము బాధ్యత తీసుకుంటాము అని చెప్పి వెళ్లి పోయారు, ఇంతటి నిర్లక్షపు కాంట్రాక్టర్ వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇంట్లోనే ప్రాణాలు పోవాల్సిందేనా దీనికి సిఎంసీ కమీషనర్, జాయింట్ కమీషనర్, కాంట్రాక్టర్ ఎవరు బాధ్యత వహిస్తారు అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు