ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాలకు కూన శ్రీశైలం గౌడ్‌ కి ఆహ్వానం

Sakshitha news

ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాలకు కూన శ్రీశైలం గౌడ్‌ కి ఆహ్వానం

హైదరాబాద్: వచ్చే నెల 4న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవాలకు హాజరుకావాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించారు.

ఈ మేరకు మినిస్టర్ క్వార్టర్స్‌లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్, గౌరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.