పేదలు, మైనార్టీలు, మహిళల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది:: మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్.
ఉయ్యూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ వార్డులో మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్ర ప్రసాద్, టీడీపీ చైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ అభ్యర్థి షేక్ మబీనా విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. మహిళలు పూలజల్లులు కురిపిస్తూ, హారతులు ఇచ్చి, ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొని టీడీపీకి మద్దతు తెలిపారు.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “పేదలు, మైనారిటీలు, మహిళల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
కాలువ కట్టకు తను,తన సతీమణి భ్రమరాంబ సర్పంచ్లు గా ఉన్నప్పుడు రోడ్లు, విద్యుత్ దీపాలు, త్రాగునీరు ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామని రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తు చేశారు.
అర్హులైన పేదలకు త్వరలో టిడ్కో ఇళ్లు అందజేస్తాం” అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
“చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, షేక్ మబీనాను తమ అమూల్యమైన రెండు ఓట్లనుసైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. వాళ్లు ఇద్దరూ కూడా తమలాగే అభివృద్ధి చేసి చూపిస్తారని రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ నాని గారు, రత్నం శివప్రసాద్ బుజ్జి గారు, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ , చేదుర్తి పాటి శ్యామల సయ్యద్, అజ్మతుల్లా, షేక్ అసిఫ్,షేక్ ఇస్మాయిల్ పండు,స్వాతి జబ్బర్, జబీ, నూరు, షేక్ హరీష్, గోరా, రాజుల పాటి ఫణి కుమార్, జంపాన నరసింహారావు, దేవేంద్ర, అబ్బాస్, పెద్ద ఎత్తున ముస్లిం మహిళ సోదరీమణులు, టిడిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST