పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించాలి:: మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్రప్రసాద్ .
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉయ్యూరులోని ఐదవ వార్డ్ లో తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ ను, కౌన్సిలర్ అభ్యర్థి చింతలపూడి కిరణ్ కు మద్దతుగా ప్రచారం చేశారు .
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వార్డును అభివృద్ధి చేయాలంటే స్థానిక సంస్థల్లో టీడీపీ బలపడాలి. అందుకే 5వ వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి చైర్మన్ అభ్యర్థి చేదుర్తి పాటి ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ అభ్యర్థి చింతలపూడి కిరణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి. అని రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ నాని , వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ , రత్నం శివప్రసాద్ , మురాల అయ్యగారు, సయ్యద్ అజ్మతుల్లా బాబు , చేదుర్తి పాటి ప్రవీణ్ , డాలి , ఎం జె రవి,అగస్టీన్, మణి చింతలపూడి ఏసు పాదం , చేదుర్తిపాటి శ్యామల , ఇంకా మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST