ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి – కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి – కూన శ్రీశైలం గౌడ్

షాపూర్ నగర్: కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్‌లోని వారి నివాసంలో చింతల్, గాజులరామారం, జీడిమెట్ల, కొంపల్లి, దుండిగల్ సర్కిళ్లకు చెందిన పలువురు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి తాగునీరు, అంతర్గత సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై వినతిపత్రాలు సమర్పించారు.

ప్రజల సమస్యలపై స్పందించిన కూన శ్రీశైలం గౌడ్ కొన్ని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టారు. మిగిలిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అదేవిధంగా, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇందుకోసం తన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

▪️ఈ కార్యక్రమంలో పలువురు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.