బండారి లేఔట్ డివిజన్ రాజీవ్ గృహకల్ప వద్ద డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ

Sakshitha news

బండారి లేఔట్ డివిజన్ రాజీవ్ గృహకల్ప వద్ద డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: బండారి లేఔట్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప వద్ద భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలాం దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఆయన జీవితం, ఆశయాలు యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, బండారి లేఔట్ డివిజన్ అధ్యక్షులు వాసు వరగాని, ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తాతిరెడ్డి), మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్, కె. అమృతయ్య, కమిటీ నిర్వాహకులు మొయినుద్దీన్, రఫత్, రామచంద్ర నాయక్, సరిత లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్లా, నయాబ్, బాలరాజు, ప్రసాద్ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్, శ్యామ్ గౌడ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.