ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన…!
- ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసించాం…!
-డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్
ఏఐసిసి కార్యదర్శి
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు నిరసనగా ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో కలిసి నల్ల రిబ్బన్లు ధరించి కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీరును నిరసించారు.
ఈ సందర్భంగా డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ మాట్లాడుతూ…! ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, ప్రతి అర్హుడైన ఓటరుకు తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం నిలబెట్టేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని ఆయన అన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
