ప్రమాదంలో గాయపడిన కౌన్సిలర్ కుంభం రాజేందర్‌కు కొప్పుల వేణారెడ్డి పరామర్శ
ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో,
ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన సూర్యాపేట మున్సిపాలిటీ 32వ వార్డు కౌన్సిలర్ కుంభం రాజేందర్‌ను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేందర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, బాలెంల మాజీ సర్పంచ్ రామసాని రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పిండిగ విజయ్ కుమార్, గోలీ రాంరెడ్డి, చిత్తలూరి జానయ్య, బొల్లెం వెంకన్న, కోడి కిరణ్, పిల్లల నాగరాజు, అనంతుల నవీన్, షేక్ నాసిర్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
