పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్టీ ఆర్ పోలీస్ కమిషనరేట్, విజయవాడ,
ఎన్టీ ఆర్ జిల్లా
కూలింగ్ వాటర్ కెనాల్లో లభ్యమైన మహిళ దారుణ హత్య కేసును ఛేదించిన ఇబ్రహీంపట్నం
పోలీసు వారు.
సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సోషల్ మీడియా సహకారంతో అతి తక్కువ సమయంలో ఎటువంటి ఆధారాలు లేని హత్యకేసును చేదించి నిందితుడు అరెస్ట్.
కేసు పూర్వాపరాలు
ది. 18.09.2026 న సాయంత్రం సుమారు 05:00 గంటల సమయంలో డాక్టర్ NTTPS Stage-II SW Pump House / Cooling Water Canal Intake ప్రాంతంలో ఒక మహిళకు చెందిన మొండెం నీటిలో తెలడాన్ని గమనించిన NTTPS డి.ఈ. ఇబ్రహీంపట్నం పోలీసు వారికి సమాచారం అందించారు. వెంటనే సదరు సమాచారంపై ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, మొండెంను వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సదరు ఘటనను తీవ్రంగా పరిగణించి కేసును త్వరితగతిన చేధించి నిందితులను అరెస్ట్ చేయాలని నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు పశ్చిమ జోన్ డి.సి.పి. శ్రీ జి.రామ కృష్ణ పర్యవేక్షణలో పశ్చిమ డివిజన్ ఎ.సి.పి. శ్రీ ఎన్.ఎస్.వి.కె. దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ శ్రీ ఎ.సుబ్రహ్మణ్యం గారు వారి సిబ్బందితో కలిసి ప్రత్యెక బృందాలను ఏర్పాటు చేసి అధునాతన డ్రోన్ కెమెరాలను మరియు ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలతో కూలింగ్ కెనాల్ లో విసృతంగా గాలించి మొండెం యొక్క బాగాలను గుర్తించడం జరిగింది.
ప్రాధమిక దర్యాప్తులో సదరు మొండెం మరియు బాగాల ఆధారంగా సుమారు 20 నుండి 35 సంవత్సరాల వయస్సు గల మహిళగా గుర్తించడం జరిగింది. కాని ఆమెకు సంబంధిచిన ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఒక బృందం ద్వారా సదరు శరీర బాగాలపై ఉన్న గుర్తులు, ఒంటిపై ఉన్న వస్తువులు, బట్టలను, చేతిపై ఉన్న నెమలి పించం ట్యాటు ఆధారంగా చేసుకుని మీడియా ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా విస్తృత ప్రచారం చేయడంతోపాటు ఇంస్తాగ్రాం, ఫేస్ బుక్ వంటి వాటిల్లో విస్తృతంగా గాలించడం జరిగింది.
అదేవిధంగా మరో రెండు బృందాలు కలిసి ఇబ్రహీంపట్నం, కూలింగ్ కెనాల్ పరిసర ప్రాంతాల్లోని CCTV కెమెరాల ఫుటేజ్, టోల్గేట్ వద్ద అనుమానాస్పద వాహనాల వివరాలను సేకరించారు. మరో రెండు బృందాలు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులు, ఆసుపత్రులు, డెంటల్ ఆసుపత్రులు, టాటూ సెంటర్లు మరియు బ్యూటీ పార్లర్ సెంటర్లలో వేరిపై చేయటం జరిగింది.
ఈ సమగ్ర దర్యాప్తులో మృతురాలు గుంటూరు జిల్లా, మంగళగిరిలో నివసిస్తున్న ఏలూరు జిల్లా, కలిదిండి మండలం, చిన్న తాడినాడ గ్రామానికి చెందిన కర్రి దుర్గ @ కల్యాణి గా (29 సం.) గుర్తించడం జరిగింది.
సదరు మహిళను హత్య చేసిన నిందితుడి గురించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇన్స్పెక్టర్ గారికి రాబడిన పక్కా సమాచారం మేరకు భవానీపురం హెచ్.బి.కాలని లోని నిందితుని ఇంటి వద్ద షఫీని అదుపులోనికి తీసుకుని విచారించి అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితుల వివరాలు:
1.విజయవాడ భవానిపురం హెచ్.బి.కాలని పార్క్ రోడ్డు ఏరియాకు చెందిన షేక్ షఫీ (46 సం.)
మృతురాలు అయిన ఏలూరు జిల్లా, కలిదిండి మండలం, చిన్న తాడినాడ గ్రామానికి చెందిన కర్రి దుర్గ @ కల్యాణి కొంతకాలంగా గుంటూరు జిల్లా, మంగళగిరిలో నివసిస్తూ ఒక హోటల్ నందు పనిచేస్తుంది. ఈ క్రమంలో సదరు హోటల్ యజమానితో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తున్న క్రమంలో ఒక బాబుకు జన్మనిచింది. ఈ క్రమంలో సదరు బాబును నిందితుడైన విజయవాడ భవానిపురం హెచ్.బి.కాలని పార్క్ రోడ్డు ఏరియాకు చెందిన మాంసం విక్రయించే షేక్ షఫీ కి దత్తత ఇచ్చింది. ఈ క్రమంలో మృతురాలికి మరియు నిందితునికి మధ్య డబ్బుల విషయంలో మరియు బాబు విషయంలో గొడవలు జరుగుతునాయి. ఈ క్రమంలో నిందితుడు షఫీ ఏ విధంగానైనా ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక ప్రకారం షఫీ కుటుంబ సబ్యులను ఊరు పంపించి మృతురాలిని ది.17.09.2026 తేదిన ఇంటికి పిలిపించి మటన్ కొట్టే కత్తితో హత్య చేసినాడు.
అనంతరం నిందితుడు మృతదేహం ఆనవాళ్ళు కనిపించకుండా చేయడానికి తన మిత్రుడైన షేక్ అబ్దుల్లా @ దుర్గారావు సహాయంతో మృతదేహానికి కాళ్ళు, చేతులు, తల విడి భాగాలుగా వేరు చేసి ఎవ్వరూ లేని సమయంలో వాటిని బైకుపై తీసుకుని వెళ్లి వేరు వేరు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం తుమ్మలిపాలెం, గొల్లపూడి ప్రాంతాల్లోని కూలింగ్ కెనాల్ లో పడవేసి అక్కడ నుండి వెళ్లిపోయినాడు.
అప్పటి నుండి ఈ సంఘటనపై సమాచారాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా తెలుసుకుంటూ ఏమి తెలియనివాడిలాగా గమనిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ వారు అతని ఇంటివద్ద అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
నిండితుడికి సహకరించిన మరో నిండితుడు షేక్ అబ్దుల్లా @ దుర్గారావు పరరిలో ఉన్నాడు.
ఎటువంటి ఆధారాలు లేని హత్య కేసును తక్కువ సమయంలో చేధించి నిందితుడుని అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎ.సి.పి. శ్రీ ఎన్.ఎస్.వి.కె. దుర్గారావు గారిని, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ శ్రీ ఎ.సుబ్రహ్మణ్యం గారిని, ఎస్.ఐ.లు శ్రీ రవి వర్మ గారు, శ్రీమతి సత్యవతి గారు, శ్రీ చక్ర దొర గారు, శ్రీ సన్యసి నాయుడు గారు, శ్రీ శ్రీనివాస రావు గారు వారి వారి సిబ్బందిని ఉన్నత్తాధికారులు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
