సిరిసిల్ల సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు ఈకూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

సిరిసిల్ల సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు ఈకూన శ్రీశైలం గౌడ్

సిరిసిల్ల: ఈ నెల 30వ తేదీన సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లను కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ , ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా సభా ప్రాంగణం, వేదిక, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఇతర మౌలిక వసతులపై సంబంధిత నాయకులు, నిర్వాహకులతో ఆయన చర్చించారు.

సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కూన శ్రీశైలం గౌడ్ సూచించారు. సభా ప్రాంగణంలో ప్రజలకు తాగునీరు, కూర్చునే సౌకర్యం, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సభను విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు.

అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో సభకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బల్మూర్ వెంకట్ ,MLC శంకర్ నాయక్ , మరియు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ K.K మహేందర్ రెడ్డి ,DCC అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…