వినాయక నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాలలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్లోని చర్చ్ గాగిల్లాపూర్, గండిమైసమ్మ, శంభీపూర్, మహేశ్వరం మల్లంపేట్(సాయి బాలాజీ కాలనీ) లలో వివిధ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక నిమజ్జన శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని యువతకు సూచించారు. నిర్వాహకులకు, యువతకు శుభాకాంక్షలు తెలిపారు. శంభీపూర్ మరియు మహేశ్వరం గ్రామాలల్లో అన్నదాన కార్యక్రమాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST