KKM ట్రస్ట్ అధినేత, మేడ్చల్–మల్కాజ్‌గిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్

Sakshitha news

KKM ట్రస్ట్ అధినేత, మేడ్చల్–మల్కాజ్‌గిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ గాజులరామారం సర్కిల్ పరిధిలోని మెట్కన్ గూడ, కైసర్ నగర్ ప్రాంతాల్లో పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయా వినాయక మండపాల కమిటీ సభ్యులు కూన శ్రీనివాస్ గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి తో పాటు డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్, తోసిఫ్, అంజి యాదవ్, భవానీ, రాజు, కిషోర్ తదితరులతో పాటు వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.