కూటమి అభివృద్ధిని చూసి తట్టుకోలేక విమర్శలు

Sakshitha news

కూటమి అభివృద్ధిని చూసి తట్టుకోలేక విమర్శలు

రిజర్వేషన్ కాకముందే బుచ్చి చైర్మన్ కాండిట్ ని ఎలా నిర్ణయిస్తారు

మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట తీరుపై తీవ్రంగా మండిపడ్డ టీడీపీ శ్రేణులు

కోవూరు టిడిపి కార్యాలయం నందు టిడిపి శ్రేణులు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన వైసిపి విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాట తీరుపై తీవ్రంగా మండిపడ్డ టిడిపి నాయకులు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నాయని వీటిని చూసి తట్టుకోలేక ,ఓర్చుకోలేక మా పై విమర్శలు చేస్తున్నారని వారు తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఎంతగానో అభివృద్ధి చేసి చూపిస్తుందని వారు చూసి తట్టుకోలేక ఏం మాట్లాడాలో తెలియక మతిభ్రమించి మాట్లాడుతున్నారని వారు తెలిపారు. రిజర్వేషన్లు కాకముందే బుచ్చి మున్సిపల్ చైర్మన్ నిర్ణయించడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఈవీఎంల ద్వారా గెలిచామని పదేపదే అంటున్నారని ఈవీఎంల ద్వారా గెలిచే పని అయితే మా ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వాలు ఏర్పడవని వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి టౌన్ అధ్యక్షులు ఇంతామల్లారెడ్డి, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, సాయి తేజ రెడ్డి, బెల్లంకొండ విజయ్, షేక్ సాదీక్, యద్దలపూడి నాగరాజు, టిడిపి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.