ప్రజాసేవకు పదవులతో సంబంధం లేదు
పదవులు ముగిసినా ప్రజలతో అనుబంధం శాశ్వతం.. ప్రజాసేవే ముఖ్యం
కోవూరు మండల పరిషత్ పాలకవర్గానికి వీడ్కోలు సన్మాన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కోవూరు మండల ప్రజాపరిషత్‌లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు పివిఆర్ కళ్యాణ మండపంలో ఎంపీపీ తుమ్మల పార్వతి ఏర్పాటుచేసిన వీడ్కోలు సన్మాన సభ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి, ఐదేళ్లపాటు వారు అందించిన సేవలను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పదవులతో సంబంధం లేదు ప్రజాసేవ ముఖ్యం.పదవులు తాత్కాలికం.. పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజలతో ఉన్న అనుబంధం ముగిసిపోదని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నంతకాలం ప్రతి ఒక్కరూ నాయకులేనని పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా గత ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, తమ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల్లో పనిచేసిన ఈ ఐదేళ్ల అనుభవాన్ని భవిష్యత్తులోనూ కోవూరు మండల అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, జెట్టి రాజగోపాల్ రెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, తుమ్మల చంద్ర, గాదిరాజు అశోక్, సాయి తేజ రెడ్డి, బెల్లంకొండ విజయ్, పాలూరు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST