లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులు అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులు అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పలువురు పేద ప్రజలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ, చికిత్స ఖర్చులకు సరిపడా ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.

ఈరోజు బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు CMRF మంజూరి పత్రాలు (చెక్కులు) అందజేశారు.

➡️ బచ్చు రమేష్ కి రూ . 60,000
➡️ డెఱుంగుల లక్ష్మి కి రూ . 45,000
➡️ మహ్మద్ చాంద్ పాషా కి రూ . 60,000
➡️ దూసకంటి విజయ లక్ష్మ కి రూ . 60,000
➡️ కె.సీతా మహాలక్ష్మి కి రూ . 60,000
➡️ కట్కోజ్వాలా రత్నాకర్ కి రూ . 60,000
➡️ బాడిగ రవి చంద్రశేఖర్ కి రూ . 32,500
➡️ పి విష్ణు వర్ధన్ రెడ్డి కి రూ . 60,000
➡️ గొల్ల జనార్దన్ కి రూ . 40,000

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ…..ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాతీయ దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు రత్న డా. బుధల అమర్ బాబు, డీసీసీ ఉపాధ్యక్షులు బుయ్యని శివ కుమార్, సెక్రటరీలు గణేష్, సంతోష్ ముదిరాజ్, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, రంగ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు జలీల్ ఖాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బేకు శ్రీనివాస్, బోయిని వెంకటేష్, శ్రీధర్ వర్మ, చంద్రకళ, మధుసూదన్ రెడ్డి, అంజి రెడ్డి, సోము, శ్యామ్ , కుత్బుల్లాపూర్ సేవాదళ్ అధ్యక్షులు అజామ్, షైక్ ఇబ్రహీమ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.