26వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
లబ్ధిదారులకు కార్డులు అందజేసిన కౌన్సిలర్ నేహా నాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్
కోదాడ, సాక్షిత :
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 26వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం స్థానిక రేషన్ దుకాణం వద్ద నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ నేహా నాజ్తో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో డిజిటల్ విధానంలో స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులు నిత్యావసర సరుకులను మరింత సులభంగా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కార్డులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు బాగ్దాద్, సునీత, వీరబాబు, అరుణ, అల్లాభి, సాజిదా బేగం, షాహిన్, తాజుద్దీన్, వీరభద్రం తదితరులతో పాటు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST