జపాన్ విజిట్ పూర్తి చేసుకున్న టీచర్

Sakshitha news

జపాన్ విజిట్ పూర్తి చేసుకున్న టీచర్ రాజశేఖర్‌కు ప్రశంసలు….*

సాక్షిత : సూర్యపేట జిల్లా /కోదాడ:
ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్‌కు డీఈఓ ప్రశంసలు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున జపాన్ ఎక్స్‌పోజర్ విజిట్ కి వెళ్ళి పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సూర్యాపేట జిల్లా ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్‌ను జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ వారి కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
సెప్టెంబర్ 5 నుండి 12 వరకు జరిగిన ఈ అధ్యయన పర్యటనలో జపాన్‌లోని విద్యావిధానం, పాఠశాలల్లో ఐసీటీ వినియోగం, విద్యార్థుల్లో స్వీయ శుభ్రత పాటించే పద్ధతులు మరియు నూతన విద్యా దృక్పథాలను రాజశేఖర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యటన వివరాలను డీఈఓకు వివరించగా, ఆయన రాజశేఖర్ సాధించిన గుర్తింపును ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మారం పవిత్ర, తాళ్లూరి సాయి ఈశ్వరి, చారుగుండ్ల రాజశేఖర్‌లు కలిసి డీఈఓ అశోక్‌ను ఘనంగా సత్కరించారు.