ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కి వినతి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద సూచనల మేరకు 7 రోజుల కార్యక్రమాల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ డివిజన్ మల్లంపేట్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని, ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులను పోలీసులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారందరూ విమర్శించారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కాపాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ని వేడుకుంటూ వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పాలనను ప్రశ్నించేందుకు నిన్న అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేయడం దుర్మార్గమని, ఈరోజు అసెంబ్లీకి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం మరింత దుర్మార్గమని వారు మండిపడ్డారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచివేయకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు బెంబడి బుచ్చిరెడ్డి, అనంత స్వామి, ఎల్లుగారి సత్యనారాయణ, వార్డు ప్రెసిడెంట్ గండిగూడెం రమేష్, నాయకులు సగ్గిడి శ్రీనివాస్, మాదాస్ నవీన్, ఆకుల బాబు, వేణు గౌడ్, బైండ్ల గోపాల్, గండిగూడెం నరసింహ శ్రీనివాస్ రెడ్డి, కుంట్ల నందు, కోటేష్, రాము, సద్దాం, యువ నాయకులు విష్ణు, వరాల రామ్, మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST