క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం…

Sakshitha news

క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం…

మామునూరు 4వ బెటాలియన్ లో ఇంటర్-కంపెనీ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే KR నాగరాజు …

క్రీడలు మానసిక శారీరక వికాసానికి ఎంతో దోహద పడతాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. మామునూరు 4వ బెటాలియన్ టీజీఎస్పి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కంపెనీ స్పోర్ట్స్ కి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ వారి గౌరవ వందనం స్వీకరించి క్రీడలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ సిబ్బంది మానసిక ఉల్లాసం కోసం స్పోర్ట్స్ ఎంతో దోహదపడతాయన్నారు.క్రీడలు ఒక రకమైన ధ్యానం లాంటివని,ఒత్తిడి తగ్గించి, ఆరోగ్యం,పనితీరు మెరుగుపరుస్తాయన్నారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ,అంకితభావం, ధైర్య సాహసాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, ఇలాంటి క్రమశిక్షణతో కూడిన క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు అంటే కేవలం గెలుపు ఓటములకు కావని క్రీడలో మన క్రమశిక్షణ సమయపాలన పట్టుదల, ఆత్మవిశ్వాసం,జట్టు స్ఫూర్తి మరియు నాయకత్వ లక్షణాలను నేర్పిస్తాయని సిబ్బందికి శరీరకృత్వంతో పాటు మానసిక ధైర్యం కూడా ఎంతో అవసరమన్నారు.తను చిన్న తనంలో ఈ క్రీడా మైదానంలో పోలీస్ వారిని చూసి స్పూర్తిగా తీసుకొని పోలీస్ కమిషనర్ గా రిటైర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలుపొందన్నారు. పోలీసు కుటుంబంలో ఏలాంటి ఇబ్బందులు ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని, ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావాలి ఎద్దేవ చేశారు.అనంతరం పోలీస్ అధికారులతో కలిసి బెటాలియన్ గ్రౌండ్ లో చెట్లను నాటారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సత్య శ్రీనివాస్ రావు,అసిస్టెంట్ కమాండెంట్ రాజేందర్,బాలయ్య,డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్,మాజీ కార్పొరేటర్ అరుణ విట్టల్,మాజీ డివిజన్ అధ్యక్షులు చింత ప్రకాష్, సీనియర్ నాయకులు బాబురావు,కొమురెల్లి యాదవ్, శివకుమార్,వాడేపల్లి ప్రకాష్,అరుణ,రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.