డ్రైనేజీ వ్యవస్థ రూపురేఖలు మారుస్తాం…
సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
వర్ధన్నపేట నియోజకవర్గంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 1వ, 65వ డివిజన్, 66వ డివిజన్లలో 3కోట్ల 75లక్షల విలువ గల సిసిరోడ్లు,డ్రైనేజీ పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…దాదాపు 20 నుంచి 25 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రోడ్ల సమస్య,డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఈ అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు.వర్ధన్నపేట నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.దశల వారీగా అన్ని డివిజన్లో,అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చేపడతమన్నారు.అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నారు.గత రెండు సార్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని దద్దమ్మలు అసత్య ప్రచారాలతో కాలం వెల్లబుచుతున్నారని మండిపడ్డారు.ఎక్కడ సమస్యలు ఉన్న డయల్ యువర్ ఎమ్మెల్యే నెంబర్ కి సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము,65వ డివిజన్ అధ్యక్షులు సునీల్, 66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్,ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ రైతు రాజు,ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి,హసన్పర్తి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రాకేష్ రెడ్డి,హనుమకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకటరెడ్డి, హసన్పర్తి మండల అధ్యక్షులు అశోక్, హసన్పర్తి మాజీ మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి,66 వ డివిజన్ మాజీ అధ్యక్షులు కనపర్తి కిరణ్,మండల మహిళ ఉపాధ్యక్షురాలు స్వాతి,సీనియర్ నాయకులు దేవరకొండ అనిల్,చంటి రెడ్డి,ఎర్ర ప్రకాష్,శ్రీకాంత్ రెడ్డి, విసం సురేందర్ రెడ్డి,భాషా,వేణు,కుమారస్వామి, వెంకటస్వామి,ఆనంద్,ఎల్ఐసి వెంకన్న, నరసింహ, రాములు,శ్రీనివాస్,డివిజన్ల ముఖ్య నాయకులు,అధికారులు తదితరులు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST