. కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి

Sakshitha news

కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి

….కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో మంత్రి తుమ్మల భేటీ

…..డిల్లీలో కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ స్థాపనపై చొరవ తీసుకోవాలని రామ్మోహన్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేసిన మంత్రి తుమ్మల

…. సెప్టెంబర్ 7 న ప్రతినిధుల బృందాన్ని కొత్తగూడెం పంపిస్తామని హామీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు

…. భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఎయిర్ పోర్ట్

…… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. డిల్లీలో రామ్మోహన్ నాయుడు ను ప్రభుత్వం తరపున మంత్రి తుమ్మల మర్యాద పూర్వకంగా కలిసి
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పై చర్చించారు.కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేయగానే స్పందించి ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం సివిల్ ఏవియేషన్ తరపున ఫీజు బులిటీ సర్వే చేసినందుకు రామ్మోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.ఫీజుబులిటీ సర్వే లో ప్రతిపాదిత స్థలం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం అనువుగా లేనందున మరో స్థలం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేశామని అక్కడ ఫీజుబులిటీ సర్వే నివేదిక సిద్ధమైందని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

…మంత్రి తుమ్మల విజ్ఞప్తి మేరకు ఈ నెల 7 తేదీన ప్రతినిధుల బృందాన్ని కొత్తగూడెం పంపిస్తామని హామీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు.

…..మంత్రి తుమ్మల మాట్లాడుతూ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.
జాతికి వెలుగులు అందించే సింగరేణి గనులు.. హెవీ వాటర్ ప్లాంట్..ఐటీసీ
బీ. పీ.ఎల్ సంస్థలతో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అటవీ ప్రాంతంతో ఎకో టూరిజం కు కేరాఫ్ గా నిలిచింది.దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం లో ఏర్పాటు చేశాం.గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల పారిశ్రామికంగా విద్యా పరంగా టూరిజం పరంగా జిల్లా ఎంతో పురోగతి చెందే అవకాశం ఉందని, దేశ విదేశాల నుంచి భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని రామ్మోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల సవివరంగా తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. తెలుగు బిడ్డైన రామ్మోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కల సాకారం కానుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.