ప్రసాదాచార్యుల సేవలు చిరస్మరణీయం”

Sakshitha news

“ప్రసాదాచార్యుల సేవలు చిరస్మరణీయం”
కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రభుత్వ విప్ విజయరమణరావు….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, జమ్మికుంట/ : జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన పురోహితులు వై.వా. సముద్రాల ప్రసాదాచార్యులు ఇటీవల మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు వారి కుటుంబాన్ని పరామర్శించారు.

విలాసాగర్ గ్రామంలోని ప్రసాదాచార్యుల నివాసానికి వెళ్లిన విజయరమణరావు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. ప్రసాదాచార్యుల మృతి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన విజయరమణరావు, కష్టకాలంలో తాను, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.