డిసెంబర్ లోపు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేస్తాం::మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ .
ఉయ్యూరు మున్సిపాలిటీలో జెమిని స్కూల్ సమీపంలో నిర్మించిన గృహాల నిర్మాణ పనులను పరిశీలించేందుకు తమకు కేటాయించిన గృహాలను చూసేందుకు లబ్ధిదారులను ఆహ్వానించడమైనది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ,ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…పెదమధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
టిడ్కో గృహాల లబ్ధిద గృహ సముదాయాల్లో మిగిలి ఉన్న మౌలిక వసతుల పనులు రహదారులు విద్యుత్ డ్రైనేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు ఇళ్లను డిసెంబర్ లోపుఅందజేస్తామని పేర్కొన్నారు.గత టీడీపీ ప్రభుత్వహాయంలో నిర్మాణం పూర్తిచేసినా గాని yCP ప్రభుత్వం ఐదేళ్ల పాలన లోమిగిలి వున్న 20% మౌలిక సదుపాయాల పనులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేసి ఒక్కొక్క లబ్ధిదారునికి సుమారు మూడు లక్షల రూపాయలు వరకు నష్టం కలిగించిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
టిడ్కో గృహాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు డిసెంబర్‌లోపు ఇళ్లను అందజేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాజేంద్రప్రసాద్ సూచించారు.
Mla బోడే ప్రసాద్ మాట్లాడుతూ…..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇట్లు గ్రహాల పనులను ప్రారంభించి వేగవంతం చేశామని నవంబర్ డిసెంబర్ నెలలో పనులను పూర్తి చేసి జనవరి 15 కల్లా లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ప్రతి లభిదారుడికి సొంత ఇంటికి తాళం అందజేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో ప*** నాయకులు కార్యకర్తలు అధికారులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST