రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు – వెంకటేష్ గౌడ్

Sakshitha news

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు – వెంకటేష్ గౌడ్🌸

సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి శుభసందర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కీ వారి కార్యాలయంలో రాఖీలు కట్టిన మహిళా సోదరీమణులందరికీ కార్పొరేటర్ చేతులమీదుగా చీరలు బహుమతిగా అందించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీకగా శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని అన్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ పౌర్ణమి అని, సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని క్షేమం, సంతోషం కోరుకోవడం.. సోదరుడు ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇవ్వడం ఈ పండుగలో ప్రధాన భావన అని తెలియచేశారు.

Scroll to Top