అలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ తో రాఖీ పౌర్ణమి వేడుకలు…!
ఎర్రవల్లి మండల కేంద్రంలోని:
అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ కి ఎర్రవల్లి కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి పల్లె నిర్మలా రాజు తో పాటు ఎర్రవల్లి మండల మహిళా కాంగ్రెస్ నాయకులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ రాఖీ పౌర్ణమి పండుగ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
