పచ్చదనంతోనే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్….
కుందనపల్లి అర్బన్ పార్క్లో ఘనంగా వన మహోత్సవం…మొక్కలు నాటి సంరక్షించాలి…
— ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం/ : పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.
పెద్దపల్లి జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కుందనపల్లి అర్బన్ పార్క్లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి సంరక్షించినప్పుడే పచ్చని రామగుండం, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు.
వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అటవీ శాఖ అధికారులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, శ్రీనుబాబు అభినందించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
